పుంగనూరులో జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ-చైర్మన్ అలీమ్‌బాషా
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే అగ్నిప్రమాదాలను నివారించేందుకు వీలుందని మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా అన్నారు. గురువారం అగ్నిమాపకశాఖ వారి అవగాహన సదస్సును పట్టణంలోని కొత్తయిండ్లు స్కూల్‌లో చైర్మన్ ప్రారంభించి మాట్లాడుతూ ముఖ్యంగా ప్రమదాల నివారణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ప్రమాదం జరిగిన తరువాత కూడ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రసూల్‌ఖాన్,వైస్ చైర్మన్ నాగేంద్ర, కౌన్సిలర్లు ఆదిలక్ష్మి, జయకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Accident Prevention-Chairman Aleem Basha with precautions in Punganur