Accident with N95 masks

 ఎన్ 95 మాస్కులతో ప్రమాదం

Date:21/07/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కరోనా వైరస్ సోకకుండా రక్షణ కోసం ఎక్కువ మంది ఎన్-95 మాస్కులను ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. సాధారణ మాస్కు కంటే దీని ధర 10 రెట్లకు పైగా అధికంగా ఉన్నప్పటికీ దీనికే మొగ్గు చూపుతున్నారు. అయితే.. ఈ మాస్కు కూడా కరోనా నుంచి అంత సురక్షితం కాదనే అంశం చర్చనీయాంశంగా మారింది. కవాటం (రెస్పిరేటరీ వాల్వ్‌) ఉన్న ఎన్‌-95 మాస్కులు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేవట. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన వైద్య నిపుణులే ఈ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి మాస్కులు సురక్షితమో చూద్దాం..కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేవని, దీనివల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల ‘డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్’ హెచ్చరించింది. అందువల్ల ఇలాంటి ఎన్‌-95 మాస్కులను ప్రజలు వినియోగించవద్దని సూచించింది.

 

ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసింది.వైద్య సిబ్బంది వినియోగానికి ఉద్దేశించిన మాస్క్‌లను సామాన్య ప్రజలు అనుచిత రీతిలో వినియోగిస్తున్న తీరు తమ దృష్టికి వచ్చిందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పేర్కొంది. ఎన్‌–95 మాస్క్‌లు, ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వ్‌లున్న ఎన్‌–95 మాస్క్‌ల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రజలు సాధారణ మాస్కులు ధరిస్తే చాలని.. ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని సూచించిందిరెస్పిరేటరీ వాల్వ్‌ మాస్క్‌ల వాడడాన్ని ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి. సాధారణంగా ఇలాంటి మాస్క్‌లను పారిశ్రామిక ప్రదేశాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే సిబ్బంది ఉపయోగిస్తారట. ఈ రెస్పిరేటరీ వాల్వ్‌‌లు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనిషికి అందిస్తాయి. ఇదే సమయంలో మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపించేస్తాయి. దీని పని ఇంతవరకే.

 

ఇవి ప్రత్యేకంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం తయారు చేసినవి కావు. ఈ విషయం తెలియక చాలా మంది ఈ మాస్కులను ధరిస్తున్నారు. వ్యాపారులు కూడా దీన్ని బాగా సొమ్ము చేసుకుంటున్నారు.ఒకవేళ కరోనా వైరస్ సోకిన వారు ఈ కవాటాలున్న ఎన్ 95 మాస్కులను ధరిస్తే.. వారు వదిలిన గాలి నేరుగా బయటకి వస్తుంది కాబట్టి.. వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది.అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ)’ ఈ ఎన్ 95 మాస్కులకు సంబంధించి గతంలో ఓ ప్రకటన చేసింది. ‘పరిసరాలను తప్పనిసరిగా శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాల్లో (స్టెరైల్‌ ఫీల్డ్‌) రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న మాస్కులను వాడొద్దు. మనం వదిలేసిన గాలిని అవి నేరుగా అక్కడి వాతావరణంలోకి వదిలేస్తాయి. దీనివల్ల వైరస్‌ కట్టడి కోసం మాస్కులను ధరించాలనే నిబంధనకు అర్థమే లేకుండాపోతుంది’ అని పేర్కొంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ధరించడమే చాలా సురక్షితం అని శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నాయి.ఇంట్లో తయారు చేసిన మాస్కులను వాడాలని కేంద్ర ప్రభుత్వం కూడా గతంలోనే సూచించింది.

 

మాస్కు ముఖాన్ని సరిగ్గా కవర్‌ చేసేవిధంగా ఉండాలని, దీంతో పాటు మాస్కుకు ఇరువైపులా ఖాళీలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించింది. అలాగే ఒకరి మాస్కు ఇంకొకరు ధరించకూడదని పేర్కొంది. రోజూ మాస్కులను శుభ్రం చేసుకోవాలని, వేడి నేటిలో కనీసం 5 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది.కాటన్‌తో సహజ పట్టు లేదా షిఫాన్ కలయికలో తయారు చేసిన మాస్కులు కరోనా వైరస్‌తో పాటు గాల్లో హానికారకాల నుంచి అత్యుత్తమంగా రక్షణ కల్పిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఒక కాటన్ వస్త్రం, రెండు పాలిస్టర్ లేదా షిఫాన్ వస్త్రాలను మూడు పొరలుగా ఉపయోగిస్తే 80-99 శాతం సూక్ష్మ కణాలను నిరోధిస్తున్నాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు.

 

అమూల్ తో ఏపీ ఒప్పందం

 

Tags:Accident with N95 masks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *