నిక్కచ్చిగా పంట నష్టాల అంచనా

Accidentally assessing crop losses

Accidentally assessing crop losses

Date:13/10/2018
– వ్యవసాయ శాఖ మంత్రి  సోమిరెడ్డి
శ్రీకాకుళం ముచ్చట్లు:
 పంట నష్టాల అంచనా నిక్కచ్చిగా తయారు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి  అధికారులను ఆదేశించారు. శని వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంట నష్టాల ఎన్యూమరేషన్ పై  నిర్వహించిన  అవగాహనా కార్యక్రమానికి మంత్రి విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిత్లీ తుఫాను వలన  పలాస, ఇఛ్ఛాపురం, టెక్కలి నియోజక వర్గాలలో 13 మండలాలలో పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు.1.39 లక్షల హెక్టార్లలో వరి పంట, 20 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వీటిలో  జీడి, అరటి, కొబ్బరి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోరాదనే వుద్దేశ్యంతో ముఖ్యమంత్రి పంట నష్టాన్ని పక్కాగా అంచనా వేయాలని తెలిపారన్నారు.  కేంద్ర సాయం కన్నా ఎక్కువ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.
వరి పంట అంచనాలకు 320 మందిని, ఉద్యానవన పంటల పరిశీలనకు 135 మందిని విశాఖపట్నం, విజయనగరం నుండి కూడా డిప్యూట్ చేయడం జరిగిందని తెలిపారు.  పంట నష్టం కలిగిన ప్రతీ రైతుకు నష్ట పరిహారాన్ని త్వరితగతిన  అందచేయడం జరుగుతుందని చెప్పారు.  కొబ్బరి చెట్టుకు రూ.1,000 లు, జీడి, మామిడికి హెక్టారుకు రూ.20 వేలు, అరటి పంటకు హెక్టారుకు రూ.25 వేలు ఇన్ పుట్ సబ్సిడీని అందించడం జరుగుతుందని తెలిపారు. మూడు రోజులలో ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వంశధార నీరు విడుదల ద్వారా  శీకాకుళం, నరసన్నపేట, ఆముదాల వలస మండలాలలో 25 వేల హెక్టార్ల   పంట  నీట మునిగిందన్నారు.  ఉద్యానవన అధికారుల సహకారంతో గ్రామాలలో ఎన్యూమరేషన్ చేయాలని తెలిపారు.
ఉపాధిహామీ సిబ్బంది కూడా ఎన్యూమరేషన్ కు తోడ్పాటు అందించాలని చెప్పారు.అనంతరం ఎన్యూమరేటర్లకు పంట నష్టం అంచనాలపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యసాయ శాఖ స్పెషల్ కమీషనరు మురళీధర రెడ్డి, ఉద్యానవన శాఖ కమీషనరు చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జి.రామారావు, ఆత్మ పి.డి. డి.ప్రమీల, హార్టికల్చర్ ఎ.డి. ఎ.పి.ఎం.ఐ.పి. పి.డి.నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికారి చౌదరి,వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏ.డి.ఎ.లు, ఏ.ఓ.లు, తదితరులు హాజరయ్యారు.
Tags:State agriculture minister Somireddy Chandramohana Reddy has ordered the officials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *