సిపిఎం అందోళన

విశాఖపట్నం ముచ్చట్లు:

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలపై అధిక ధరలతో భారాలను పెంచుతుందని సిపిఎం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందనీ, ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ నిరుద్యోగాన్ని పెంచుతోందనీ ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.నూతన విద్యా విధానం తో పేదలకు విద్యను దూరం చేస్తున్నా రని, కార్మిక చట్టాలపై వేటు వేసారని ఆ పార్టీ నేత జగ్గు నాయుడు అన్నారు. ప్రజల సంపదను అదానీ,అంబానీ వంటి బడా కార్పొరేట్లకు దోచిపెడుతు న్నారని, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మండిపడ్డారు. విద్యు త్, ఆర్టిసిఛార్జీలు,అస్థిపన్ను, చెత్తపన్నులు పెంచి వైసిపి ప్రభుత్వం బిజెపితో పోటీపడుతున్నారని చెప్పారు. ఆదాయాలు తగ్గి భారా లు పెరిగి ప్రజలు అష్టకష్టాలు పడు తున్నారనీ, బిజెపి, వైసిపి పాలకులు ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానా లకు వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వం నుండి దేశ ప్రజలను, దేశాన్ని కాపాడు కోవ డం కోసం సిపిఎం పార్టీ సెప్టెంబరు 14 నుండి 27 వరకు దేశ రక్షణ భేరి నిర్వహిస్తోందనీ తెలిపారు. ముగిం పుగా 27 మహా ప్రదర్శన, అనంతరం సభ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

 

Tags: According to CPM

Leave A Reply

Your email address will not be published.