శాస్త్రోక్తంగా వైభవోత్సవ మండపంలో శ్రీవారి స్నపన తిరుమంజనం
తిరుమల ముచ్చట్లు:
కార్తీక వనభోజనం సందర్భంగా ఆదివారం తిరుమలలోని వైభవోత్సవ మండపంలో శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.ప్రతి ఏడాది కార్తీక మాసంలో పార్వేటి మండపం వద్ద కార్తీక వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కార్తీక వనభోజనాన్ని టీటీడీ రద్దు చేసింది.అయితే వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Tags:According to science, Srivari Snapana Thirumanjanam in Vaibhavotsava Mandapam
