రైతు బంధుకు ఖాతా చిక్కులు (ఆదిలాబాద్)

Accounts for the farmer's relative (Adilabad)

Accounts for the farmer's relative (Adilabad)

Date:13/10/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
రైతు బంధు సాయం పంపిణీ ప్రహసనంగా మారింది. చెక్కులను నేరుగా రైతులకు అందజేయకుండా.. ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. మరోవైపు అన్నదాతలు నిరాశకు గురవుతున్నారు. పంట పెట్టుబడులు అధికమవుతుండటం.. ఎరువుల ధరలు పెరుగుతుండటం, చీడపీడల ఉద్ధృతి పెరుగుతుండటంతో ఎకరాకు రూ.4వేలతో కొంతలో కొంత ఊరట లభిస్తుందని ఆశించారు. శుక్రవారం జిల్లాకేంద్రానికి చెక్కులు రావడం.. పలు గ్రామాల్లో పంపిణీ జరగడంతో ఇక చేతికి చిక్కినట్లేనన్న ఆనందం వ్యక్తమైంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం రాత్రి లేఖ రాయడంతో ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అధికారులు సందిగ్ధంలో పడ్డారు.
గత ఖరీఫ్‌లో చెక్కులను పోలీస్‌స్టేషన్లు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ శాఖ భద్రపరచగా ఈ సారి వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. అంతలోనే చెక్కులు పంపిణీ చేయరాదని, నేరుగా ఖాతాలో జమ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల్లో గణాంకాలు మారిపోయాయి. ఖరీఫ్‌లో తీసుకున్న రైతుల ఖాతాలకే నేరుగా జమ చేయాలని నిర్దేశించారు. జిల్లాలో పాసుపుస్తకాలు 135280 ఉండగా చెక్కులు 1.35 లక్షల వరకు చెక్కులను ఖరీఫ్‌లో పంపిణీ చేశారు. ఈ లెక్కన కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 7927 మంది రైతులుండగా 8167 చెక్కులు వచ్చాయి. అలాగే కొత్తపల్లి మండలంలో 4993 మంది రైతులకు 5141 చెక్కులు, మానకొండూరు మండలంలో 14,694 మంది రైతులు కాగా 13530 చెక్కులు వచ్చాయి.
శంకరపట్నం మండలంలో 9468 రైతులుండగా 9878 చెక్కులు, తిమ్మాపూర్‌లో 9117 రైతులకు 8981 చెక్కులు, వీణవంకలో 10183 రైతులకు 9996చెక్కులు, చిగురుమామిడిలో 9456 రైతులకు 8658, చొప్పదండిలో 9710 రైతులుండగా 9592 చెక్కులు, ఇల్లందకుంట మండలంలో 6977 రైతులకు 6965 చెక్కులు, గంగాధరలో 11870 రైతులకు గానూ 10856 చెక్కులు, హుజూరాబాద్‌ మండలంలో 9181 రైతులుండగా 9382 చెక్కులను, సైదాపూర్‌లో 9432 రైతులకు 10013, రామడుగులో 9821 రైతులకు 9375, జమ్మికుంటలో 8450 రైతులకు 7476 చెక్కులు, గన్నేరువరంలో 5002 రైతులకు 4824, కరీంనగర్‌ అర్బన్‌ మండలంలో 8 మంది రైతులకు 3 చెక్కులను అందించారు. సదరు లెక్క ప్రకారమే రైతులకు నేరుగా ఖాతాలో జమ చేయనున్నారు.
అయితే బ్యాంకు ఖాతా లేని రైతులు వేలల్లో ఉన్నారని అంచనా. ఇప్పటివరకు వచ్చిన చెక్కులను ఆధార్‌ కార్డు, పాస్‌పుస్తకం చూపితే బ్యాంకులో నగదు ఇచ్చేవారు. ఇపుడు ఎలా చేయాలన్నది అధికారుల ఆలోచన..ప్రతి ఖరీఫ్, యాసంగి పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ.4వేల చెక్కును అందించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి పక్కాగా నిర్వహించారు. భూ ప్రక్షాళనలో వేలమంది రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదు. ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్న సమయంలో సుమారు 10వేల మంది రైతులకు పాసుపుస్తకాలు ఇచ్చారు.
కానీ అప్పటికే ఖరీఫ్‌ చెక్కుల పంపిణీ ముగియడం.. చెక్కులు రానివారి వివరాలను పంపాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆదేశించారు. అయినా ఆచరణలో ఇప్పటివరకు వారికి చెక్కులు రాకపోగా తాజాగా యాసంగి సాయానికి నోచుకోవడం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రెంటికి చెడ్డ రేవడిలా మారింది రైతుల దుస్థితి. వాస్తవానికి పాసుపుస్తకాలు లేకున్నా ధరణి వెబ్‌సైట్‌లోని వివరాలతో తహసీల్దార్‌ ధ్రువీకరించి ఇస్తే వ్యవసాయ శాఖ చెక్కు ఇచ్చే వెసులుబాటు ఉంది. కానీ, రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు దాఖలాలు లేవు.
Tags:Accounts for the farmer’s relative (Adilabad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *