Natyam ad

హత్య కేసులో ముద్దాయి అరెస్టు

బద్వేలు రూరల్ సీఐ సుదర్శన్ ప్రసాద్

బద్వేలు ముచ్చట్లు:

Post Midle

బి కోడూరు మండలం అంకనగొడుగునూరు ఎస్సీ కాలనీకి చెందిన కోడూరు విజయరావు అనునతడు తన తమ్ముడైన కోడూరు రాంబాబు అనునతడు తరచుగా తాగి వచ్చి మీకు ఇల్లు ఉన్నది నాకు ఇల్లు మీరు ఇవ్వలేదు, మన నాయనకు సంబంధించిన భూమిని నాకు పంచలేదు అంటూ తనను తన భార్యను బూతులు తిడుతున్నాడని, గతంలో కూడా తనను కొట్టి గాయపరిచాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని అతడిపై కక్ష పెంచుకొని ఈనెల 18వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో యధావిధిగా సదరు రాంబాబు తాగి వచ్చి తనను తన భార్యను బూతులు తిడుతూ ఉండగా విజయరావు కోపోద్రిక్తుడై తన వద్ద ఉన్న తుమ్మకట్టేతో రాంబాబు ముఖం పైన,, తల మీద, చాతి మీద బలంగా నాలుగు ఐదు సార్లు  కొట్టడంతో తలకు తీవ్ర రక్తగాయమై పడిపోగా అతడి అన్న భాస్కర్ ఆసుపత్రికి తరలించగా అప్పటినుండి తిరుపతి రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండి 22.10.23వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో రాంబాబు కోలుకోలేక మరణించగా ఈ విషయమై మృతుడి భార్య రామలీల ఫిర్యాదు మేరకు బి.కోడూరు పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయడమైనది. ఈ కేసులో ముద్దాయి అయిన కోడూరు విజయరావును బద్వేలు రూరల్ సీఐ ఎం సుదర్శన్ ప్రసాద్ 23.10.2023 వ తేదీ సాయంత్రం 6 గంటలకు అతని ఇంటి వద్ద అరెస్టు చేసి ఈ దినము కోర్టుకు హాజరు పరచడమైనది.

 

Tags: Accused arrested in murder case

Post Midle