Natyam ad

చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు

రూ.6 లక్షల సొత్తు స్వాధీనం
పక్షం రోజుల్లో ఛేదించిన నల్లపాడు పోలీసులు
ప్రశంసించిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్

గుంటూరు ముచ్చట్లు:


చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి చోరీలకు అలవాటుపడి,అనతి కాలంలోనే డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం మొదలుపెట్టిన నెల్లూరు జిల్లా,ఆత్మకూరు మండలం ఎన్ ఆర్ పల్లె కు చెందిన రాగి మారుతీరావు గత కొంతకాలంగా గుంటూరు రూరల్ మండలం పరిధిలోని గోరంట్ల హనుమాన్ నగర్ 2వ లైనులో నివాసముంటున్నాడు.గత నెల 3న బృందావన్ గార్డెన్స్ సమీపంలోని చౌదరి మెడికల్ షాపు ముందు ఉన్న సుజుకి యాక్సెస్ (AP FY 7622) ద్విచక్ర వాహనాన్ని,8న తిరుమల నగర్లో హోండా యాక్టివా (AP 39QY 7413) వాహనాన్ని, అదే ప్రాంతంలోని ఒకటవ లైనులో ఓ ఇంటిలో ఎవ్వరూ లేని సమయాన్ని గమనించి,ఆ ఇంటి తాళాలు పగలగొట్టి మొదటి బెడ్ రూమ్ నందు బంగారు వెండి ఆభరణాలు, వస్తువులు చోరీ చేసినట్లు దక్షిణ మండల సబ్ డివిజన్ పోలీసు అధికారి ఏండి.మహబూబ్ బాషా శనివారం డివిజన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

 

 

Post Midle

నిందితుడిని అమరావతి రోడ్డులో గల హోసన్నా మందిరం సమీపంలో ద్విచక్ర వాహనం పై వస్తుండగా వలపన్ని నల్లపాడు పోలీసులైన సీఐ.బత్తుల శ్రీనివాసరావు, ఎస్సై డి.అశోక్,హెడ్ కానిస్టేబుల్ కాకుమాను సుబ్బారావు,కానిస్టేబుళ్లు ఎస్కే.జాన్ సైదా,డి.పోతురాజు, కే. వెంకట నారాయణ శాకచక్యంగా వ్యవహరించి నిందితుడు రాగి మారుతీరావును అదుపులోకి తీసుకున్నారు.అతని వద్దనుండి 75 గ్రాముల బంగారపు వస్తువులు,సుమారు 250 గ్రాముల వెండి వస్తవులను,రూ.లక్షా రెండువేలను,రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.వాటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని,ముద్దాయిని రిమాండుకు పంపినట్లు డిఎస్పీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులను,సిబ్బందిని అభినందించారు.

 

Tags; Accused arrested in theft cases

Post Midle