Natyam ad

ఎటిఎం వ్యాన్ 64 లక్షల చోరీ కేసులో నిందితుడు ఆత్మహత్య

-మేనేజర్ ప్రోద్బలంతోనే చోరీ

-సూసైడ్ లేఖ రాసిన మహేష్

ఒంగోలు ముచ్చట్లు:

Post Midle

ఇటీవల ఒంగోలులోఎటిఎం వ్యాన్ లో 64 లక్షల రూపాయలు దొంగతనం చేసిన మహేష్ సోమవారం తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే ఇటీవల జరిగిన cms కంపెనీకి చెందిన ఎటిఎం వ్యాన్ లో క్యాష్ దొంగతనం లో ముద్దాయి అయిన సన్నమూరి మహేష్ (వయసు23) అదే కంపెనీ లో పని చేస్తూ క్యాష్ దొంగతనం చేసి పట్టుబడిన క్రమంలో అవమానంగా భావించి సంతనూతలపాడు మండలం కామేపల్లి వారి గ్రామంలోని తన నివాసంలో ఈ ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.చనిపోతూ సూసైడ్ లేఖ రాసిన మహేష్ ఈదొంగతనం తన మేనేజర్ అయిన పెద్ద కొండారెడ్డి ప్రోద్బలంతో చేసానని పేర్కొన్నాడు.దీంతో ఈ కేసు మరో మలుపు తిరగబోతో౦ది.

 

Tags; Accused commits suicide in ATM van 64 lakh theft case

Post Midle