Natyam ad

మైనర్‌ బాలిక హేమలత అత్యాచారం కేసులో నిందితుడు గణేష్‌ అరెస్ట్

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని కమతంపల్లెకి చెందిన మైనర్‌ బాలిక హేమలత(17) పై అత్యాచారం చేసి ఆబాలిక ఆత్మహత్యకు కారణమైన కేసులో నిందితుడు గణేష్‌ను రిమాండ్‌కు తరలించారు. బుధవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కమతంపల్లెకి చెందిన హేమలతను ఇటుకల బట్టి వద్ద ఈనెల 7న మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన గణేష్‌ అత్యాచారం జరిపాడు. ఈ సమయంలో బాలిక కేకలు వేయడంతో తల్లి , గ్రామస్తులు బాలికను కాపాడారు. దీనిపై మనస్తాపానికి గురైన బాలిక ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సీఐ రాఘవరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి, నిందితుడిపై పోక్సోతో పాటు వివిధ నేరాల క్రింద కేసులు నమోదు చేసి, పరారీలో ఉన్న గణేష్‌ను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా పోలీసులు సత్వరమే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించడంతో పలువురు పోలీసులను అభినందిస్తున్నారు.

Post Midle

Tags: Accused Ganesh arrested in minor girl Hemalatha rape case

Post Midle