కల్నల్ పురోహిత్ పై అభియోగాలు

Accused of Colonel Purohit

Accused of Colonel Purohit

Date:30/10/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

మాలేగావ్ పేలుళ్ల కేసులో మొత్తం ఏడుగురు నిందితులపైనా ఎన్ఐఏ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా నిందితులపై ఉగ్ర కుట్ర, హత్యానేరంతో పాటు పలు అభియోగాలను నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. కాగా అభియోగాల నమోదు వాయిదా వేయాలంటూ పురోహిత్ ఇవాళ ఉదయం చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక ధర్మాసనం తిరస్కరించింది. ట్రయల్ కోర్టు అభియోగాలు మోపిన కొద్ది సేపటికే ఏడుగురు నిందితులు తాము నేరం చేయలేదంటూ కోర్టుకు విన్నవించారు. ట్రయల్ కోర్టులో అభియోగాల నమోదు వాయిదా వేయాలంటూ నిన్న దాఖలైన పిటిషన్లను బోంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే తనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద విచారణ జరపడాన్ని సవాల్ చేస్తూ పురోహిత్ పెట్టుకున్న పిటిషన్‌పై వచ్చే నెల 21న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఈ మేరకు పురోహిత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ ఎన్ఐఏ కౌన్సిల్ సందేశ్ పాటిల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

జ్వరాల నియంత్రించేందుకు చర్యలు

Tags:Accused of Colonel Purohit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *