Natyam ad

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో ముద్దాయికు యావజ్జివ కారాగార శిక్ష

కృష్ణాజిల్లా ముచ్చట్లు:

 

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో ముద్దాయికు యావజ్జివ కారాగార శిక్ష విధించిన స్పెషల్ ఫోక్సో కోర్ట్ జడ్జి .కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలో దోమల గుంది గ్రామంలో మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో ముద్దాయికి ఈరోజు మచిలీపట్నం స్పెషల్ ఫోక్సో కోర్టు యావజ్జీవ జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించారు.కేసు వివరాల్లోకి వెళితే 2019 సంవత్సరంలో కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమల గొంది గ్రామానికి చెందిన మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన పెద్ద సింధు ప్రసాద్ అను అతను అత్యాచారానికి పాల్పడడంతో, బాలిక యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రక్రియ పూర్తి చేసి, చార్జిషీట్ నమోదు చేసి ఈ కేసును కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది.

 

 

Post Midle

పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన MV మహేష్ కుమార్  ఈ కేసులో కొంతమంది సాక్షులను విచారించి సాక్ష్యాలు సేకరించి వాదోపవాదనుల అనంతరం ముద్దాయి పై నేరం నిరూపణ కావడంతో జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు జడ్జి   షేక్ మహమ్మద్ ఫజుల్లా గారు ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష ,10,000/- జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో విచారణ ప్రక్రియ అంత సజావుగా జరిగి ముద్దాయి ఎక్కడ బాధితురాలిని ప్రలోభానికి గురి చేయకుండా చూసి, నేరస్తునికి చట్ట ప్రకారం శిక్ష పడడానికి కృషిచేసిన పోలీస్ అధికారులకు, కోర్ట్ కానిస్టేబుల్ కు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి, కోర్టు సిబ్బందికి ఎస్పీ  అభినందనలు తెలిపారు.సమాజంలో పనిచేసే ప్రదేశంలో గానీ, నిత్య కార్యకలాపాలలో అయినా ఏవైనా లైంగిక వేధింపులు గాని, అల్లరి మూకల ఆగడాలు గాని ఎదురైతే ధైర్యంగా DAIL -100, దిశా ఆప్ కు, ఫిర్యాదు చేయవచ్చని మీకు ఎల్లవేళలా కృష్ణాజిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, జిల్లా ఎస్పీ   పి జాషువా ఐపీఎస్గా తెలిపారు.

 

Tags: Accused sentenced to life imprisonment in minor girl rape case

Post Midle