Natyam ad

అచ్చెన్న వర్సెస్ అయ్యన్న…

శ్రీకాకుళం  ముచ్చట్లు:


ఎక్కడైనా.. ఏ రాష్ట్రమైనా.. హోం మంత్రులకు అంత సీనుందా? ఇప్పుడు అందరి నోటా ఇదే ప్రశ్న. నో ఆన్సర్. ఎందుకంటే ఏ ప్రభుత్వంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా హోంమంత్రులకు అంత సీన్ లేదన్నది అందరికీ తెలుసు. కానీ హోం మంత్రి పదవి కోసం మాత్రం పోటీ పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోంమంత్రి పదవి కావాలనిపిస్తుంది. కానీ అదే అధికారపార్టీలో ఉంటే దానంత వేస్ట్ పదవి మరొకటి ఉండదని ఆ పదవిని అనుభవించిన వారు అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి అధికారాలుండవు. ఆదేశాలు ఇచ్చే అవకాశముండదు. ప్రొటోకాల్ మినహా మరి ఏ ఇతర అధికారాలు ఉండవు. అది తెలంగాణ అయినా… ఆంధ్రప్రదేశ్ అయినా.. మరే రాష్ట్రమయినా అంతే. బదిలీల నుంచి నియామకాల వరకూ అంతా ముఖ్యమంత్రి కార్యాలయమే చూసుకుంటుంది.హోంమంత్రి ఎవరున్నా నామమాత్రమే. సంతకం పెట్టడానికే తప్ప మరి దేనికీ ఉపయోగపడరు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రి పదవి కావాలని ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు అచ్చెన్నాయుడు. మరోనేత అయ్యన్న పాత్రుడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తాము హోం మంత్రి అయిపోతామని, ఇప్పుడు వైసీపీకి కొమ్ముకాస్తున్న పోలీసులకు తగిన బుద్ది చెబుతామని, వెంటాడి.. వేటాడుతామని చెబుతూ ఒకటే హోరెత్తిస్తున్నారు. ఆ మధ్య ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయినప్పుడు అచ్చెన్నాయుడు కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, అధికారంలోకి రాగానే చంద్రబాబును అడిగి హోంమంత్రి పదవిని తీసుకుని మరీ పోలీసులపై పగ తీర్చుకుంటానని శపథం చేశారు.. ఇక అయ్యన్న పాత్రుడు ఇంకో అడుగు ముందుకేశారు.

 

 

తొమ్మిది నెలల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చిన వెంటనే తాను హోంమంత్రితో పాటు లా అండ్ ఆర్డర్ పదవిని కూడా తీసుకుని వైసీపీకి వత్తాసుపలుకుతున్న పోలీసులను వెంటాడతానని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే తమకు హోంమంత్రి పదవి కావాలని ఇద్దరు సీనియర్ నేతలు పట్టుబడుతుండటంపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. నిజంగా అన్నారా? లేక కార్యకర్తల్లో జోష్ నింపడానికి అన్నారా? అన్నది తెలియకున్నా వారి వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి.నిజంగానే టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరికీ హోంమంత్రి పదవి దక్కుతుందా? అంటే లేదనే చెప్పాలి. నోరున్నోళ్లకు ఆ పదవి ఎవరూ ఇవ్వరు. అచ్చెన్న, అయ్యన ఇద్దరూ నోరు, పట్టున్న నేతలు. వారికి హోంమంత్రి పదవి దక్కే అవకాశం లేదు. ఎవరో ఒకరు సామాజికవర్గం పరంగా తమకు నమ్మకైన వారినే తెచ్చి హోం మంత్రి పదవిలో కూర్చుండబెడతారు. మాట్లాడలేని నేతలనే ఆ పదవికి ఎంచుకుంటారు. అది చంద్రబాబు అయినా.. జగన్ అయినా కానీ అయ్యన్న, అచ్చెన్నలకు అంత రాజకీయ అనుభవం ఉన్నా తమకు మాత్రం హోంమంత్రి కావాలనడం అత్యాశ కాక మరేముంటుందన్న ప్రశ్నలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

 

Post Midle

Tags: Achenna vs Ayanna…

Post Midle