Date:13/01/2021
శ్రీకాకుళం ముచ్చట్లు:
నిరసన తెలుపుతూ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెంనాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు భోగి మంటలను జరుపుకున్నారు. రైతు వ్యతిరేక జీవోలను మంటల్లో వేసి భోగి పండుగ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామం లో సంక్రాంతి వేడుకలలో భోగిమంట వద్ద ప్లకార్డులతో రైతులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే పండుగ ఎలా జరుపుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై అచ్చన్న నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి 19 నెలల్లో రైతుల కోసం ఏం చేశారో చెప్పాలంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిచంఆరు. అమ్మిన పంటకు డబ్బులు చెల్లించాలని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉంటే రైతుల పండుగ ఎలా చేసుకుంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు రైతు కవసరమైన ఒక పనిముట్టు నైనా అందించారని అడిగారు. రైతు ప్రభుత్వం అని చెప్పే నాయకులు రైతులు జరిపే పండుగకు సంక్రాంతి కానుకగా ఇచ్చారు అంటూ విమర్శించారు. కరువు ప్రాంతాలు గుర్తింపులో శ్రీకాకుళం జిల్లా కు అన్యాయం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులు కు ఆశ పడి రైతులకు అన్యాయం చేస్తున్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు రైతు వ్యతిరేక చట్టాలపై కనీసం మాట్లాడటం లేదు . పండగ వచ్చింది రైతుల కాదని దోచుకుంటున్న అధికార పార్టీకి విమర్శించారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Achennai protested