పంటల్లో రికార్డ్ సాధిస్తాం

మెదక్ ముచ్చట్లు :

భూమికి బరువయ్యేంత పంటను పండించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో నూతనంగా నియమితులైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓపిక పట్టిన కార్యకర్తకు తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు.మండుటెండల్లో కూడవెల్లి వాగు ప్రవహిస్తుందని కలలో కూడా అనుకోలేదు. సాగునీరైనా, తాగునీరైనా 70 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ వాళ్లు ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. బీహార్, ఛత్తీస్ గఢ్‌, యూపీ రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి వ్యవసాయ పనులు చేసే పరిస్థితికి తెలంగాణ చేరుకుందన్నారు. సాగులో పంజాబ్, హర్యానా రాష్ట్రాల కంటే ముందు వరుసలో మనం ఉన్నామన్నారు.రాబోయే రోజుల్లో 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచేలా గోదాముల కట్టిస్తాం. దుబ్బాక నియోజకవర్గంలో 15 రోజుల్లో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ పూర్తి చేసేలా నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీనిచ్చారు. అలాగే వాన చినుకు భూమిపై పడకముందే రైతు బంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని మంత్రి ప్రశంసిచారు.కరోనా సమయంలో కూడా రైతుకు కొండంత అండగా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అవసరమైతే మిగతా పనులు ఆపుతాం. కానీ రైతుకు మాత్రం అన్నీ సరైన సమయంలో అందిస్తామని పేర్కొన్నారు.వెద జల్లే పద్ధతిలో వరి సాగు, ఆయిల్ ఫామ్, ఫామాయిల్ తోటలు పెట్టి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు మంత్రి సూచించారు. వరి వెదసాగు పద్ధతిని ప్రోత్సాహించాలని రైతులను కోరారు.పత్తి సాగును ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం. నాయీ బ్రాహ్మణ, రజకులకు కరెంటు ఫ్రీ తోపాటు సబ్సిడీ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

 

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:Achieve record in crops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *