దళిత వర్గాలపై జరుగుతున్న  దాడులపై చర్య తీసుకోవాలి

– జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్‌కు వర్ల రామయ్య లేఖ

 

అమరావతి  ముచ్చట్లు :

 

తరచుగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాలపై జరుగుతున్న  దాడులపై తగు చర్య తీసుకోవాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మరియు పొలిట్  బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రస్తుత ప్రభుత్వంలో దళిత వర్గాలపై ఎన్నో దాడులు జరుగుతున్నా, జాతీయ షెడ్యూల్డ్  కులాల కమీషన్ ఉదాసీనంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. నెల్లూరు జిల్లాలో మట్టి మాఫియా దౌర్జన్యాన్ని ప్రశ్నించిన మల్లికార్జున్‌పై తప్పుడు కేసులు బనాయించిన  నెల్లూరు పోలీసులపై చర్య తీసుకోవాలని  కోరారు. దాడి చేసిన అధికార పార్టీ వారిని వదిలి దళిత వర్గానికి చెందిన మల్లికార్జున్‌పై కేసు పెట్టడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని తెలిపారు. మల్లికార్జున్‌పై రౌడీషీట్ పెట్టాలని అధికార  పార్టీ నాయకుల కోరిక తీర్చడం కోసం పోలీసులు తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. రెండేళ్లుగా  రాష్ట్రంలో జరుగుతున్న  దళిత వర్గాలపై దాడులను  విచారించడానికి  ప్రత్యేక కమిటీని పంపవలసిందిగా కమీషన్‌ను కోరారు. జాతీయ మానవ హక్కుల కమీషన్ అన్నా, షెడ్యూల్డ్ కులాల కమీషన్ అన్నా,  జాతీయ గిరిజన కులాల కమీషన్ అన్నా  ఈ ప్రభుత్వానికి కించిత్  గౌరవం కూడా లేదని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Action must be taken against the ongoing attacks on Dalit communities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *