నదుల పునరజ్జీవంపై కార్యచరణ ప్రణాళిక రూపొందించాలి

Action plan should be created on rehabilitation of rivers

Action plan should be created on rehabilitation of rivers

Date:31/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం నదుల పునరుజ్జీవ పై నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ముసాయిదా కార్యచరణ ప్రణాళికను జనవరి 15 లోగా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో నదుల పునరుజ్జీవ కమిటి సమావేశం సి.యస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ మిశ్రా, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, మెట్రోవాటర్ వర్క్స్ యం.డి దానకిషోర్, పీసీబీ  సెక్రటరి సత్యనారాయణ రెడ్డి, ఈపీటీఆరై డీజీ  కల్యాణచక్రవర్తి, టీఎస్ఐఐసీ ఎమ్డీ వెంకట నర్సింహారెడ్డి, ఇరిగేషన్ ఇఎన్సీ  మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ ఎస్.కె.జోషి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ నదులకు సంబంధించిన  ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, మెట్రొవాటర్ వర్క్స్, మున్సిపాలిటి, పరిశ్రమలు తదితరశాఖలు.
జనవరి 5 లోగా తమ డాటాను నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్సిట్యూట్ (నీరి) కు అందజేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం వాటర్ షెడ్ మ్యాప్  ను రూపొందించాలని అన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా నీటి నాణ్యతను మానిటరింగ్ చేయాలని తెలిపారు. నదులలో కాలుష్యానికి సంబంధించి ముఖ్యమైన ప్రాంతా లపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి సంబంధించి పీసీబీ ద్వారా నీటి నాణ్యత, ఇరిగేషన్ ద్వారా నీటి పరిమాణం పై అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీపీల  నిర్మాణానికి సంబంధించి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్  ను నోడల్ వ్యవస్ధగా నియమించడానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. మొత్తం సీజన్ కు సంబంధించిన మినిమమ్ హైడ్రోలాజికల్ ఎన్విరాన్మెంట్ ఫ్లో పై నివేదికను రూపొందించాలన్నారు. నీరి  ఇచ్చే ముసాయిదా నివేదికపై జనవరి 3 వ వారంలో మరోసారి కమిటి సమావేశం కావాలని నిర్ణయించారు.
Tags:Action plan should be created on rehabilitation of rivers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *