Natyam ad

అమృత ఆసుపత్రి డాక్టర్లపై చర్య తీసుకోవాలి

కొత్తగూడెం ముచ్చట్లు:

 


తన కొడుకు మంద రాకేష్ మృతిపై జిల్లా వైద్య అధికారులు సమగ్ర విచారణ చేసి నిర్లక్ష్య వైద్యం  అందించిన అమృత మల్టి స్పెషాలిటి హాస్పిటల్ డాక్టర్ ఇరుకు బాబురావుపై చర్యలు తీసుకోవాలని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్న  మంద వెంకన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన మందా వెంకన్న జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడు రాకేష్ ను వైద్యం కోసం బాబురావు వద్దకు తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో చేరిన 24 గంటల తర్వాత డాక్టర్ తనను కలిసి పర్వాలేదు మీ బాబుకు ఏమి కాదంటూ చెప్పుకుంటూ చివరికి నా కొడుకు మృతదేహాన్ని ఇంటికి పంపాడని కన్నీటి పరర్యంతమయ్యాడు. డాక్టర్ ను నమ్మి తన చేతులారా కొడుకును చంపుకున్నానని నా కొడుకుకు జరిగినట్టు వేరే ఎవరికీ జరగకూడదని నిర్లక్ష్యంగా వైద్యం చేసిన అమృత హాస్పిటల్ డాక్టర్ ఇరుకు బాబురావుపై సమగ్ర విచారణ చేసి ఆయన లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ఆసుపత్రిని సీజ్ చేయాలనీ అప్పుడే నా కొడుకు మంద రాకేష్ ఆత్మ శాంతిస్తుందన్నారు.

 

Tags: Action should be taken against Amrita hospital doctors

Post Midle
Post Midle