అక్రమలేఔట్లపై చర్యలు తీసుకోవాలి

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:24/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో అక్రమలేఔట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావుతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా లేఔట్లు ఏర్పాటు చేయడంతో తెలియనివారు ఆప్లాంట్లను కొనుగోలు చేసి, తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అలాగే ఇలాంటి లేఔట్ల కారణంగా మున్సిపాలిటి ఆదాయానికి గండిపడుతోందన్నారు. ముఖ్యంగా పట్టణంలో గృహ యజమానులు ప్లాన్లు ప్రకారం గృహాలను నిర్మించాలని లేకపోతే గృహ నిర్మాణాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

కరోనా పరీక్షలు …

పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు రెండవ విడత కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కరోనా తీవ్రమౌతోందన్న నేపధ్యంలో రెండవ విడత కరోనా పరీక్షలను చేపట్టామన్నారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు వ్యక్తి గత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, కరోనా నియంత్రణలో సహకరించాలన్నారు.

ఉపాధ్యాయులకు శిక్షణ….

పట్టణంలోని ఉపాధ్యాయులకు ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనికేషన్స్స్కిల్స్పై శిక్షణా తరగతులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఆంగ్లబోధనలో నైపుణ్యాన్ని సాధించి, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ శిక్షణలో శిక్షకులుగా సునీల్‌కుమార్‌, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి, కృష్ణమరాజు పాల్గొన్నారు.

గ్రేటర్ లోఓటర్ రివర్స్ గేర్

Tags: Action should be taken against illegals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *