Natyam ad

నలంద విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి

నంద్యాల ముచ్చట్లు:
 
నంద్యాల పట్టణంలో బుధవారం నాడు ఓ ప్రకటనలో యస్ యప్ ఐ నాయకులు మాట్లాడుతూ
విద్యాశాఖ అధికారులు కళ్లు తెరవాలి-ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నలంద విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇంటర్మీడియట్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నలంద జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి అని పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ నిరంజన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న నలంద విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని . ఇలా వ్యవహరించడం వెనుక అధికారులు విద్యాసంస్థల యాజమాన్యం ఇచ్చే తాయిలాలకు పాల్పడ్డారా అనే అనుమానం వ్యక్తమవుతోందని . నలంద విద్యా సంస్థలకు పోలీస్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, మున్సిపల్ శానిటరీ సర్టిఫికెట్, ఫైర్ సర్టిఫికెట్ లేకున్నా, అదేవిధంగా హాస్టల్  నిర్వహించడానికి కూడా అనుమతి లేకున్నా విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ నాణ్యతలేని భోజనాన్ని అందిస్తున్నారని, పరిమితికి మించి హాస్టల్లో విద్యార్థులను ఉంచుతున్నారని విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని తెలిపారు. ఇంటర్మీడియట్ నిబంధనల ప్రకారం రెండెకరాల ఆటస్థలం,వాహన సౌకర్యం, పార్కింగ్ స్థలం, బాల ,బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల సౌకర్యం,ల్యాబ్ గ్రంధాలయం,  సైన్స్ విభాగానికి 2000 చదరపు అడుగులు, ఆర్ట్స్ విభాగానికి 1200 చదరపు అడుగులు స్థలం ఉండాలి. భౌతిక శాస్త్రం 4 టేబుల్స్ 20 చొప్పున ఉండాలి రసాయనశాస్త్ర ల్యాబ్కి 4 టేబుల్స్ ఉండాలి ప్రతి ప్రయోగశాలకు రెండు అలమరాలు ఉండాలి. అయితే వీటికి విరుద్ధంగా నలంద కళాశాల నడుస్తుందని అని వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కళాశాలల పై చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాలను సీజ్ చేయాలని వారు అన్నారు . లేకపోతే  ఆందోళనలకు సిద్ధమవుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షుడు రమణ, నాయకులు తేజ సాయి మౌలాలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Action should be taken against Nalanda educational institutions