విచారణ జరపకుండా తమ ఇళ్లు నేలమట్టం చేయించిన తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి

పాడేరు సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన బాధితులు
విశాఖపట్నం  ముచ్చట్లు:
విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం అరడకోట గ్రామం లో  కోర్ర నీలకంఠం  ఇల్లు నేలమట్టం చేయించిన తాసిల్దారు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని  ఏఐవైఎఫ్ పాడేరు మండలం నాయకులు  జి  మున్నా ,జీవన్  బాధితులు సింహాచలం , నీలకంఠం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ: అరడకోట  గ్రామంలో  నీలకంఠ ఇల్లు విషయమై  రెండు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా రెండు కుటుంబాలకు మధ్య వివాదం జరుగుతోంది. ఈ వివాదంపై తాహసిల్దారు వారికి అలాగే పాడేరు సబ్ కలెక్టర్ వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే  గ్రామస్థాయి పూర్తి విచారణ జరపకుండా    ఆ స్థలం, ఇల్లు ఎవరిది అని పూర్తి జడ్జిమెంట్ ఇవ్వకుండానే  అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రామ స్థాయి విచారణ జరపకుండా అతి ఉత్సాహం తో  ఇళ్లు నేలమట్టం చేయించిన  రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని  ఈరోజు పాడేరు సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామ స్థాయి విచారణ జరిపి నిజా నిజాలు తేల్చి  బాధితులకు న్యాయం జరగాలని, లేనిపక్షంలో బాధితులతో ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Action should be taken against the tasildar who demolished their house without holding an inquiry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *