విరాళాల సేకరణ నిధుల దుర్వినియోగానికి  పాల్పడిన  వారిపై చర్యలు తీసుకోవాలి

నెల్లూరు ముచ్చట్లు :
నెల్లూరు జిల్లా, గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని 2 వ డివిజన్ గుడిపల్లి పాడులో ఉన్న శివాలయం అభివృద్ధి పేరిట మేకల సుధాకరయ్య కుమారుడు మేకల అనిల్ కుమార్, కనుపూరు చిన్నయ్య కుమారుడు కనుపూరు వెంకటేశ్వర్లు విరాళాల సేకరణ , నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గుడిపల్లి పాడు గ్రామస్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గుడి ప్రతిష్ట,, కరపత్రాల ముద్రణ పేరిట సేకరించిన విరాళాల నగదును పైన పేర్కొనబడిన ఇద్దరు, తమ ఆస్తులను పోగేసుకునినేందుకు తమ చేతివాటం ప్రదర్శించారని  ఆరోపించారు. కోటికి పైగా ఆలయం నిధులను దుర్వినియోగం చేసిన వారిని ప్రభుత్వం చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేకల అనిల్ కుమార్, కనుపూరు వెంకటేశ్వర్లు సేకరించిన విరాళాల లెక్కలను ఆడిట్ చేయించి , పై వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి పాడు గ్రామ వైకాపా నాయకులు, 2వ డివిజన్ ఇంచార్జి పడిగి నేటి  రామ్మోహన్, కె నాగరాజు. పి శ్రీనివాసులు, పీవీ సుబ్బయ్య, ఎం మల్లికార్జున, రవి. సురేష్, జీవ రత్నం తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Action should be taken against those responsible for the misuse of fundraising funds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *