దళిత మైనర్‌ బాలికపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Action should be taken against those who assaulted a Dalit minor girl

Action should be taken against those who assaulted a Dalit minor girl

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

అనంతపురం జిల్లా కెపిఉడ్డి గ్రామంలో దళిత కులానికి చెందిన మైనర్‌ ప్రేమికులపై గ్రామ పెద్దలు దాడి చేశారు. శనివారం ఈ విషయమై మాలమహానాడు పట్టణ అధ్యక్షుడు ఎన్‌ఆర్‌.అశోక్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ యమల సుదర్శనం కలసి నిరసన తెలిపారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని, ప్రేమికులకు రక్షణ కల్పించి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలని డిమాండు చేశారు. ఈ విషయమై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు ప్రతినిధులు మనోహర్‌, మోహన్‌, శ్రీనివాసులు, శివ, చక్రి, రెడ్డెప్ప, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు .

కమిషనర్‌ వర్మకు టైలర్లచే సన్మానం

Tags; Action should be taken against those who assaulted a Dalit minor girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *