Natyam ad

సీజనల్ వ్యాధుల నియంత్రణకు కార్యచరణ

గడివేముల ముచ్చట్లు:


గ్రామాలలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన గడివేముల ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది. ఏఎన్ఎం ఆశ వర్కర్ల తో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయం పరిధిలో డాక్టర్ ,ఆరోగ్య సిబ్బంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపి నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం వైద్యులు సచివాలయం పరిధిలో ఉన్న పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. పోషకాహార లోపం అనారోగ్యం బారిన పడిన పిల్లలను గుర్తించి వారికి మెరుగైన వైద్యం సేవలను అందిస్తారన్నారు. సీజనల్ వ్యాధులలైన డెంగ్యూ, మలేరియా, గ్రామాల్లో  చర్యలు చేపట్టాలని అన్నారు. పరిశుద్ధం పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యులు సృజన, ఎంపిహెచ్ఈవో మహేశ్వర్ రెడ్డి, సూపర్వైజర్ వేణుగోపాల్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Action to control seasonal diseases

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.