Natyam ad

అర్హులైన వారికి భూసేకరణ పరిహారం పంపిణీకి చర్యలు-జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి  ముచ్చట్లు:


అర్హులైన వారికి భూసేకరణ పరిహారం అందేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.శుక్రవారం సమావేశ మందిరంలో సీ.ఎం.ఓ ఇరిగేషన్ శాఖ ఓ ఎస్ డి మనోహర్, కాళేశ్వరం ఈఎన్ సీ నల్ల వెంకటేశ్వర్లు, ఇతరున్నతాధికారులతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 100 మీటర్ల ఎఫ్.ఆర్.ఎల్ లెవల్ మేర భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో 455 ఎకరాల 22 గుంటల మేరకు భూమి సేకరించాల్సి ఉందని, వీటిలో కోంత మేర ప్రభుత్వ భూమి మినహాయించి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సిన భూముల వివరాల పై చర్చించారు.  ప్రజలకు అవగాహన కల్పించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని అన్నారు.

 

 

జిల్లాలో ప్రభుత్వ భూమి కి సైతం కోంత మంది పరిహారం కోరుతున్నారని, వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదని కలెక్టర్ తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.  జిల్లాలో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కింద సేకరించిన భూ వివరాలు వెంటనే ప్రభుత్వం పేరు పై మ్యుటేషన్ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. జిల్లాలో ప్రభుత్వ సేకరించిన భూమి హద్దులు నిర్దేశించాలని, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున  మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.భూ సేకరణ సమయంలో కోంత మంది డబుల్ పేమెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇప్పటికే పరిహారం అందినప్పటికి మరోసారి  చేసుకున్న దరఖాస్తులు తిరస్కరించాలని, అర్హులకు పరోహారం అందాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  ఇర్రిగేషన్ శాఖ సి.ఎం.ఓ ఓ.ఎస్.డి. మనోహర్, కాళేశ్వరం ఈ. ఎన్. సి.  వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత , ఆర్.డి.ఓ. శ్రీనివాస్, నీటి పారుదల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు..

 

Post Midle

Tags: Actions for disbursement of land acquisition compensation to eligible people-District Collector Bhavesh Mishra

Post Midle