Natyam ad

గిరిజనులకు ఇండ్ల స్థలాలు, భూమి పంపిణీకి చర్యలు-డిఎఫ్‌వో చైతన్యకుమార్‌

పుంగనూరు ముచ్చట్లు:

అటవీప్రాంతంలో నివశిస్తున్న గిరిజనులను అన్ని విధాల ఆదుకునేందుకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం క్రింద ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని డిఎఫ్‌వో చైతన్యకుమార్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని షీకారిపాళ్యెంలో ట్రైబుల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మూర్తి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి గిరిజన కుటుంబీకులతో సమావేశం నిర్వహించారు. డిఎఫ్‌వో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గిరిజనుల కుటుంభాలకు ఇండ్ల స్థలాలు, భూమి కేటాయించేందుకు పరిశీలిస్తున్నామన్నారు. గిరిజనులు తమ సాంప్రదాయ వృత్తులతో పాటు వ్యవసాయం, వ్యాపారంలో రాణించాలని, ఈ మేరకు అవగాహన కల్పించారు. అలాగే గిరిజనుల పిల్లలను సమీపంలోని పాఠశాలల్లో చదివించాలన్నారు. వీరికి అవసరమైన వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి, వీఆర్‌వో అక్భర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రాగానిపల్లి బాబునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Actions for distribution of house sites and land to tribals- DFO Chaitanya Kumar

Post Midle