Natyam ad

శ్రీకాళహస్తి తరహాలో బోయకొండలో వసతుల ఏర్పాటుకు చర్యలు

చౌడేపల్లె ముచ్చట్లు:


బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద శ్రీ కాళహస్తి ఆలయం తరహాలో వసతి గృహాలు ఏర్పాటుచేసి భక్తులకు మౌళిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు సోమవారం ఆలయ ఈఓ చంద్రమౌళితో కలిసి బోయకొండలో పరిశీలించారు. భక్తులకు అవసరమైన సదుపాయాలతో వసతి గృహాలు ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే యాత్రికులు తీసుకొచ్చే వాహనాలను పార్కింగ్‌ చేయడానికి వీలుగా అదనపు పార్కింగ్‌ స్థలం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. బోయకొండ గంగమ్మ ఆలయం వద్దకు వచ్చే యాత్రికులకు అవసరమైన మౌళిక వసతులు, భద్రత పై దృౖష్టి సారించి ఆదిశగా అభివృ ద్ది ఛేయడానికి చర్యలు తీసుకొన్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఆయన వెంట టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రరెడ్డి, నేతలు లడ్డూరమణ, సోమల మల్లికార్జు రెడ్డి,సురేంద్ర రెడ్డి, నవీన్‌రెడ్డి,గిరిబాబు తదితరులున్నారు.

 

Tags: Actions for setting up accommodation in Boyakonda on the lines of Srikalahasti

Post Midle
Post Midle