పుంగనూరు ముచ్చట్లు:
శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు కళాశాల కమిటి సభ్యులు తెలిపారు. సోమవారం ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శుభారం ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసమూర్తి, రెడ్డెప్ప హాజరైయ్యారు. సభ్యులతో కలసి సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రహారీ, లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే కళాశాల వ్యవస్థాపకులు సన్నుతిరామమూర్తి విగ్రహాన్ని ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి యేటా వార్షికోత్సవము, విద్యార్థులకు ప్రోత్సహాక బహుమతులు అందించి , ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదర్శవంతమైన కళాశాలగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు భక్తవత్సలరాజు, సత్య, రెడ్డెప్పరెడ్డి, బాలసుబ్రమణ్యం, శేషప్పగుప్తా, రంగనాయకులు, హరినాథరెడ్డి, ప్రసాద్‌తో పాటు అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Actions for the development of Punganur Degree College