నక్సల్స్ కు సహకరిస్తే చర్యలు
జయశంకర్ భూపాలపల్లి ముచ్చట్లు:
మహదేవ్ పూర్ మండలం లోని పెద్దంపేట గ్రామంలో సోమవారం ఎస్. ఐ. రాజ్ కుమార్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ. CPI మావోయిస్ట్ వారోత్సవాలు ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, అనుమానిత వ్యక్తులు మరియు సంఘ విద్రోహక వ్యక్తులు ఎవరైనా కనపడితే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని, అలాంటి వారికి ఆశ్రయం కల్పించిన వారిపై, సహకరించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత కొన్ని రోజులుగా పడుతున్న అధిక వర్షాలు, వరదల కారణంగా జ్వరం, మలేరియ, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మరియు తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలని అవగాహన కల్పించారు. మావోయిస్టుల సిద్ధాంతాల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో మహదేవ్ పూర్ ఎస్సై ఎన్ రాజ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Actions if you cooperate with Naxals

