ప్రసవ సమయంలో తల్లి మృతి ఘటనపై  చర్యలు చేపట్టాలి

-బాధిత కుటుంబానికి రూ. 10 లక్షలు నష్టపరిహారం గా ఇవ్వాలి

-శ్రీ సిటీ డిఎస్పి కి వినతి

 

సత్యవేడు ముచ్చట్లు:

ప్రసవ సమయంలో తల్లి మృతి చెందిన సంఘటన విషయంలో బాధ్యులైన ప్రైవేటు వైద్య ఆసుపత్రి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఆ మేరకు శ్రీ సిటీ డిఎస్పి పైడేశ్వరరావుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు అంతకు మునుపు సత్యవేడు తాసిల్దార్ కార్యాలయ డిప్యూటీ తాసిల్దార్ రవిచంద్ర కూడా వినతిపత్రం ఇచ్చారు వివరాలు ఇలా ఉంది..
సత్యవేడు మండలం మల్లా వారి పాలెం చెందిన రాంప్రసాద్ భార్య భవాని ప్రసవ నిమిత్తం సూళ్లూరుపేట శిశు రక్ష ఆసుపత్రికి వెళ్లడం, అక్కడ ఆమె ఆడబిడ్డ కు జన్మనిచ్చి.. ఓవర్ బ్లీడింగ్ తో మృత్యువాత పడిందన్నారు ఆ ఆసుపత్రిలో ఓ డాక్టర్ కు చిన్నపిల్లలను, గర్భిణీలను పరీక్షించే అర్హత లేకపోయినా అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు చేయడం జరుగుతోందన్నారు కేవలం శిశురక్ష ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే భవాని కన్నుమూసిందని, ఆ కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు దాంతోపాటు ఆ వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బంది, అర్హతలు వంటి విషయాలను ఆరా తీసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలన్నారు ప్రసవ సమయంలో మృతి చెందిన భవాని విషయాన్ని అధికారులు గుట్టు చప్పుడు కాకుండా తెరమరుగు చేయడం బాధాకరమైన విషయం అన్నారు జిల్లా వైద్యశాఖ పది రోజుల్లో ఈ ఘటన పై న్యాయం చేయకుంటే సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు దాంతోపాటు సూళ్లూరుపేట , వరదయ్యపాలెం, సత్తివేడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, అందులో పని చేసిన సిబ్బంది, చట్ట పరంగా ఉన్న నిబంధనలు వంటి విషయాలపై కూడా ఆకస్మిక దాడులతో మంచి వైద్యం వందే విధంగా చూడాలని వారు కోరారు సిపిఎం నాయకులు నుంచి వినతిపత్రం స్వీకరించిన డీఎస్పీ పైడేశ్వరావు మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లి మృతిచెందిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని తాము కూడా తిరుపతి జిల్లా వైద్య శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేస్తామని, సిపిఎం నాయకులు డిమాండ్లు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యువజన సంఘ నాయకులు మురళి మునసామి కిష్టయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Actions should be taken on the incident of mother’s death during childbirth

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *