కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకుంటే చర్యలు

– బాధితులను ఆదరించండి
– సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌

Date:07/08/2020

Actions to prevent corona funerals
Actions to prevent corona funerals

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా వైరస్‌ భారీన పడి మృతి చెందిన వారి అంత్యక్రియలను అడ్డుకోవడం, వారి కుటుంభాలను చిన్నచూపుతో చూడటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని , ఇలాంటి వాటిపై తమకు ఫిర్యాదు చేయాలని పుంగనూరు సీనియర్‌ సీవిల్‌జడ్కి, లీగల్‌ సర్వీసస్‌ అథారిటి చైర్మన్‌ బాబునాయక్‌ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర లీగల్‌ సర్వీసస్‌ అథారిటి ఆదేశాల మేరకు కోవిడ్‌ మరణాలు, బాధితులకు ఎదురౌతున్న సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. బాదిత కుటుంబాలకు ఎలాంటి సమస్యలు కలిగించినా అలాంటి వారిపై ఐపిసి 297 , 341 , 147 , 148 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కరోనా వ్యాధి ప్రజలను భయానికి గురిచేస్తోందని, కానీ ప్రపంచదేశాలతో పొల్చితే మనప్రాంతాలలో ఒకశాతం కూడ మరణాలు సంభవించలేదని తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారి శరీరంలో వైరస్‌ ఆరు గంటలు మాత్రమే ఉంటుందని, వారి కుటుంబ సభ్యులు వారి ఆచార సాంప్రదాయల ప్రకారం మాస్క్లు ధరించి, ప్రభుత్వాదేశాల మేరకు భౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు పూర్తి స్వేచ్చ ఉందని తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా శిక్షార్హులన్నారు. ఈ విషయమై మున్సిపల్‌ , రెవె న్యూ, పోలీస్‌ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు మానవత్వంతో సహకరించాలని కోరారు.

ఆగ‌స్టు 9న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tags: Actions to prevent corona funerals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *