Natyam ad

పుంగనూరులో ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు -కమిషనర్‌ నరసింహప్రసాద్‌

పుంగనూరు ముచ్చట్లు:

ఓటర్ల జాబితాను పకడ్భంధిగా తయారు చేయాలని, నిర్లక్ష్యం చేసినా, పొరపాట్లు చేసిన బాధ్యులుపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం తహశీల్ధార్‌ సీతారామన్‌తో కలసి బిఎల్‌వోలు, సచివాలయ ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. అలాగే చనిపోయిన వారిని గుర్తించి తొలగించాలన్నారు. ఒకరికి రెండుమూడు ప్రాంతాలలో ఓట్లు ఉండటం, ఫోటోలు మార్పిడి కావడం , పేర్లు తప్పు ఉండటం, పటిష్టంగా గమనించి చర్యలు తీసుకోవాలన్నారు. నమోదు కార్యక్రమానికి 41 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బిఎల్‌వో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాలలో బిఎల్‌వోలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పరిశీలన చేసి తుది జాబితా తయారు చేసేందుకు సహకరించాలన్నారు.

 

Post Midle

Tags: Actions will be taken if voter list is neglected in Punganur – Commissioner Narasimhaprasad

Post Midle