మళ్లీ యాక్టీవవుతున్న ముద్రగడ

ముద్రగడ తో ఏసుదాసు భేటీ

కాకినాడ ముచ్చట్లు:


రాష్ట్ర రాజకీయాలు త్వరలో మలుపు తిరగనున్నాయి. కొన్నాళ్ళు గా  స్తబ్దుగా ఉన్న కాపునాడు ఉద్యమం తిరిగి మరోసారి పుంజుకుంటోంది. రెండేళ్లుగా ముద్రగడ మౌన ముద్రలో ఉన్నారు. గత నెల రోజులుగా కోనసీమ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ అరెస్టులపై ముద్రగడ స్పందించనున్నారు. గత రెండు రోజులుగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కాపు నాయకులు ముద్రగడ మౌనం పై అసంతృప్తి  క్తం చేస్తున్నారు. కోనసీమ లో అక్రమ అరెస్టు ల పై ముద్రగడ  ఉదాసీనత ను కాపులు సహించలేక పోతున్నారు. ఇదిలా ఉండగా ముద్రగడ తన నుండి దూరమైన పంచ పాండవులు ఒక్కొక్కరిని పిలిచి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆకుల రామకృష్ణతో రెండు దఫాలుగా చర్చలు జరిపిన ముద్రగడ తాజాగా మంగళవారం  నేడు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసును తన ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించారు.ఈ భేటీలో రాష్ట్రంలో కాపులకు జరుగుతున్న అక్రమ అరెస్టులు పై చర్చలు జరిగాయి.   త్వరలో ముద్రగడ తనకిష్టమైన కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తారని సమాచారం.

 

Post Midle

Tags:Activating seal again

Post Midle
Natyam ad