చురుగ్గా ఆర్టీసి డిపో పనులు

Active RTC depot tasks

Active RTC depot tasks

Date:13/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో త్వరలో ప్రారంభించనున్న ఆర్టీసి డిపో పనులను చురుగ్గా చేపట్టినట్లు డిప్యూటి చీఫ్‌మెకానికల్‌ ఇంజనీర్‌ నరసింహులు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆర్టీసి డిపో పనులను ఆయన ఐఓసిఎల్‌ ఇంజనీర్‌ శివకుమార్‌, డీఈఈ ఈశ్వరయ్యతో కలసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పనులను చురుగ్గా చేపట్టామన్నారు. సుమారు రూ.2.50 కోట్లతో షెడ్లు , డీజల్‌ బంకు నిర్మాణాలు చేపట్టామన్నారు. కాగా గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న పుంగనూరు ఆర్టీసి డిపో ప్రజల సౌకర్యార్థం వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే ప్రారంభిస్తామని మంత్రి పెద్దిరెడ్డి హామి ఇచ్చారు. ఈ మేరకు మంత్రి తన హామిని అమలుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి డిపో పనులను చురుగ్గా చేపట్టేలా అధికార యంత్రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. డిపో పనులు జరుగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ లకుఒలు, ఆర్టీసి నేతలు కరీముల్లా, రెడ్డెప్ప, శివకుమార్‌, చంద్ర, బాషా, తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి

Tags: Active RTC depot tasks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *