Actively enter eCrop

చురుగ్గా ఈక్రాప్‌ నమోదు

Date:13/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు మండలంలో ఈక్రాప్‌ నమోదును చురుగ్గా చేపట్టినట్లు ఏవో సంధ్య గురువారం తెలిపారు. రెవెన్యూ అధికారులతో కలసి ప్రతి సర్వే నెంబరును పరిశీలించి, రైతు పేరు, పంటలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఐదు వేల హెక్టార్లలోని సాగును ఈక్రాప్‌ను నమోదు చేశామన్నారు. అలాగే హార్టికల్చర్‌ పంటలను కూడ నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి రైతు తాము పండించిన పంటలను నమోదు చేసుకున్న వారికి మాత్రమే భీమా, ఆర్థిక సహాయం అందుతుందని , ఈక్రాప్‌లో లేని వారికి ప్రభుత్వ పథకాలు అందదని తెలిపారు. రైతులు ప్రతి ఒక్కరు ఈక్రాప్‌ నమోదుకు సహకరించి, తమ పంటలను నమోదు చేసుకోవాలన్నారు.

మాలమహానాడు కార్యాలయం ప్రారంభం

Tags: Actively enter eCrop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *