Natyam ad

మొలకలచెరువు మండలాల్లో కార్యకర్తల సమావేశం

తంబళ్లపల్లె ముచ్చట్లు:

తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వరకనాథ్ రెడ్డి.నియోజకవర్గంలోని పీటీఏం, మొలకలచెరువు మండలాల్లో కార్యకర్తల సమావేశం.

 

Post Midle

ఎంపి  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కామెంట్స్……

రెండు వారాల్లో మన ఎన్నికలు జరుగుతున్నాయి.గత ఎన్నికల సమావేశంలో రోడ్లు బాగు చేస్తామని మాట ఇచ్చాం.ఆ మాట మేరకు వందలాది రోడ్లు తంబళ్లపల్లె నియోజకవర్గంలో వేశాం.ఇంకా అనేక రోడ్లు టెండర్లు అయిపోయి పనులు జరుగుతున్నాయి.రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం ను మరింత అభివృద్ది చేసి చూపిస్తాం.హంద్రీనీవా పూర్తి చేసి మన ప్రాంతానికి నీరు అందిస్తామని తెలిపాం.ఇప్పటికే అందుకు టెండర్లు పూర్తయ్యాయి, త్వరలో పనులు పూర్తి చేస్తాం.త్వరలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం.ఒక్క అవకాశం వస్తె నియోజకవర్గం లో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేసి చూపించాం.మన ప్రాంతంలో పరిశ్రమలు పెద్దఏత్తున తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతాం.

 

 

ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వరకనాథ్ రెడ్డికి, ఎంపిగా నాకు మీ ఆశీర్వాదం కావాలి.ప్రతిపక్షాలు అందరూ కలిసి శ్రీ వైఎస్ జగన్ పై యుద్ధం చేస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మనకు పథకాలు ఉంటాయి. వైఎస్ జగన్ కు మనమంతా అండగా నిలవాలి.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఒక బోరు అయినా వేశాడా ?కరోనా సమయంలో సొంత ఊరిని కూడా పట్టించుకోలేదు.10 ఏళ్లు హైదారాబాద్ లో ఉండి, ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చాడు.అలాంటి వ్యక్తికి ప్రజలందరూ ఓటు ద్వారా బుద్ది చెప్పాలి.చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దు.రానున్న ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలి.

 

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్….

మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా  పెద్దిరెడ్డి ద్వరకనాధ్ రెడ్డిని, ఎంపిగా  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించుకోవాలని.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు.మామకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు, వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసి కిరణ్ ముఖ్యమంత్రులు అయ్యారు.ముఖ్యమంత్రిగా దిగిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి మన ప్రాంతానికి వచ్చారా?చెప్పు గుర్తుతో పోటీ చేసి డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు.మన రాష్ట్రాన్ని విడగొట్టాడు, కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడు, వైఎస్ కుటుంబానికి అన్యాయం చేశాడు.

 

 

తంబళ్లపల్లె లో  ద్వరకనాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక పూర్తి స్థాయిలో రోడ్లు వేశాం.రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం.రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో చెరువులు అన్ని నింపుతాం.పుష్కలంగా తాగు, సాగు నీరు అందుతుంది.ఈ ప్రాంత వెనుకబాటును గుర్తించి  వైఎస్ జగన్ మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఆ ప్రాజెక్టులను టిడిపి అడ్డుకుంది.త్వరలో కేసులు గెలిచి ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తాం.చంద్రబాబు మాటలు, హామీలు, టిడిపి మేనిఫెస్టో ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు.చంద్రబాబు ఏ నాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు.ఫ్యాను గుర్తు పై ఓటు వేసి మన ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేసుకోవాలి.

 

Tags: Activists’ meeting in the Mandals

Post Midle