మలేరియా, డెంగ్యూ నివారణకు చర్యలు

Activities for malaria and dengue prevention

Activities for malaria and dengue prevention

Date:19/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని కుమ్మరవీధి, మేస్మివెంకటప్పస్వామివీధి, టప్పాహాజివీధి, కెకె.పాళ్యెంలో గురువారం మలేరియా , డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకున్నట్లు వెహోబైల్‌ మలేరియా డెంగ్యూ క్లినిక్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 309 గృహాలలో దోమల లార్వాల గూర్చి సర్వే చేశామన్నారు. అందులో 27 గృహములలో దోమ లార్వాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించి, మున్సిపాలిటి కార్మికులచే అబేటు ద్రావణంను పిచికారి చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌, శ్రీరాములు, వెంకట్రమణ, సభ్యులు రవిచంద్రన్‌, జిఎస్‌.అమరనాథ్‌, ప్రసాద్‌రావు, దయాళన్‌, నాగార్జున, గజరాజు తదితరులు పాల్గొన్నారు.

మలేరియా, డెంగ్యూ నివారణకు చర్యలుhttps://www.telugumuchatlu.com/activities-for-malaria-and-dengue-prevention/

Tags; Activities for malaria and dengue prevention

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *