ట్విట్టర్ పై చర్యలు షురూ

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

 

కరోనా కట్టడిలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన ‘టూల్ కిట్‌’వ్యవహారం సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను చిక్కుల్లో పడేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ట్వీట్‌‌పై ‘మ్యానిపులేటెడ్‌ మీడియా’ అంటూ ట్విట్టర్ ముద్రవేసింది. దీంతో కేంద్రం.. ట్విట్టర్ మధ్య తీవ్ర సంఘర్షణ ఏర్పడింది. టూల్ కిట్ వ్యవహారంలోఢిల్లీ పోలీసులు ట్విటర్‌ ఇండియా చీఫ్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్ మహేశ్వరిని విచారించారు. ఢిల్లీ ఉన్నతాధికారుల బృందం మే 31న బెంగళూరుకు వెళ్లి ఆయనతో చర్చించింది.అంతకు ముందు మూడు ఈ-మెయిల్స్ పంపినప్పటికీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో పోలీసులు స్వయంగా వెళ్లి ప్రశ్నించారు. నిజానికి మనీశ్‌ సేల్స్‌ విభాగం హెడ్ అయినప్పటికీ ఎండీగా చెప్పుకుంటున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ట్విట్టర్‌ భారత్‌ అనుబంధ సంస్థ టీసీఐపీఎల్‌కు చెందిన డైరెక్టర్ల వివరాలు కూడా తనకు తెలియవని ఆయన వివరించారు.

 

దాంతో మీరు ఎవరికైనా జవాబుదారీగా ఉంటారా? అని పోలీసులు ప్రశ్నించగా.. సింగపూర్‌లోని యు ససమోటోకు రిపోర్టు చేస్తుంటానని తెలిపారు.అయితే ససమోటోకు భారత్‌ వ్యవహారాలతో సంబంధం లేదని.. జపాన్‌, దక్షిణ కొరియా, అసియా పసిఫిక్‌ వ్యవహారాలు చూస్తుంటారని తెలిపింది. ట్విటర్‌కు, టీసీఐపీఎల్‌కు ఉన్న సంబంధంపై స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. అయితే భారత చట్టాలను ఉల్లంఘించడానికే టీసీఐపీఎల్‌కు సంబంధం లేదని ట్విట్టర్ చెబుతున్నట్టు అనుమానిస్తున్నారు.మరోవైపు, కొత్త ఐటీ నిబంధనలు పాటించనందుకు ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ‘సేఫ్‌ హార్బర్‌’ అన్న రక్షణ కవచాన్ని ట్విట్టర్ కోల్పోయింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాల ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేక సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది.కొత్త నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొంటూ మే 26న కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. లేకుంటే ఐటీ చట్టం కింద లభించే అన్ని మినహాయింపులు రద్దవుతాయని హెచ్చరించింది. అయినా వీటిని అమలు చేయకపోవడంతో ట్విటర్‌కు ఇచ్చిన ‘సురక్షిత ఆశ్రయం’ అన్న హోదాను తొలగించింది.
హైదరాబాద్ లో మరో కేసు
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై దేశంలోనే రెండో కేసు హైదరాబాద్‌లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకుగాను ఈ కేసును నమోదు చేశారు. అంతేకాక, కేసు పెట్టి.. ట్విటర్ ఇండియా యాజమాన్యానికి పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. ఫేక్ వీడియోపై వస్తున్న అనుచిత కామెంట్లకు ట్విటర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. నటి మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై ట్విటర్ వెంటనే స్పందించాలని నోటీసులో కోరారు. నోటీసుతోపాటు ట్విటర్‌ మరో ఇద్దరి వివరాలు కావాలంటూ కోరారు. పోలీసులను కించపరిచేలా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరూ యువకుల వివరాలను కూడా తమకు అందించాలని పోలీసులు ట్విటర్‌కు రాసిన లేఖలో కోరారు.అయితే, కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విటర్‌కు ఇప్పటివరకూ లభిస్తున్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయింది. సామాజిక మాధ్యమాల్లో డిజిట‌ల్ కంటెంట్‌పై నియంత్రణ‌కు గానూ కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న ఐటీ నిబంధ‌న‌లు మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీని ప్రకారం.. ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Activities on Twitter begin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *