Actor Jagapathi Babu in Ashok Galla, Sriram Aditya

అశోక్‌ గల్లా, శ్రీరామ్‌ ఆదిత్య చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు

Date:26/12/2019

ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్‌ సభ్యుడు జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అమర్‌రాజా  మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేశ్‌, సత్య, అర్చనా సౌందర్య ఇతర  పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు రోల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్‌ శుక్రవారం  నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జిబ్రాన్‌ సంగీతం .. రిచర్డ్‌ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. చంద్ర శేఖర్‌ రావిపాటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నటీనటులు: అశోక్‌ గల్లా, నిధి అగర్వాల్‌, జగపతిబాబు, నరేశ్‌, సత్య, అర్చనా సౌందర్య తదితరులు.

 

న్యాయవాదుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా

 

Tags:Actor Jagapathi Babu in Ashok Galla, Sriram Aditya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *