నటుడు మోహన్ బాబు గృహ నిర్భందం

Actor Mohan Babu's house arrest

Actor Mohan Babu's house arrest

  Date:22/03/2019
తిరుపతి ముచ్చట్లు:
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు స్కాలర్షిప్ బకాయిల పై గతంలో చంద్రబాబు ప్రభుత్వం పై బహిరంగ విమర్శలు చేసిన ప్రముఖ సినీనటుడు, విద్యానికేతన్ సంస్థల ఛైర్మన్ మోహన్బాబు ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు.. తన సంస్థ లోని విద్యార్థులతో కలిసి స్కాలర్షిప్ సమస్యలపై నేడు ర్యాలీ నిర్వహించి, తమ నిరసనను తెలుయ చేయాలని అయన నిర్ణయించారు. అయితే,  ఎన్నికల వేళ ర్యాలీలు, బహిరంగ నిరసనలకు అనుమతులు ఇవ్వలేమని పోలీసులు అయనకు చెప్పారు.  ముందు జాగ్రత్తగా మోహన్ బాబుతో పాటు విద్యాసంస్థకు చెందిన మరికొంత మంది కీలక సభ్యులను గృహ నిర్భందం చేసారు. ఈ పరిణాయలపై స్పందించిన మోహన్ బాబు  ఎట్టిపరిస్థితిలోను నిరసన ర్యాలీని కొనసగిస్తానంటూ ప్రకటించారు.  విద్యానికేతన్ ఎదుట మోహన్ బాబు, ఆయన కుమారులు విద్యార్థులతో కలిసి నిరసన దీక్షకు దిగారు. పోలీసుల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డు పైనే మోహన్ బాబు పడుకున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మోహన్ బాబు ఆరోపించారు. ఎన్నో విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయడం లేదని విమర్శించారు.
Tags:Actor Mohan Babu’s house arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *