దొంగతనాలకు పాల్పడుతున్న యాక్టర్ పోలిసు

Date: 09/12/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

టివి సీరియల్ లో పోలిసులా నటిస్తూ పగటి పూట దొంగతనాలకు పాల్పడుతున్న  బాలాజీ విక్కీ  అనే వ్యక్తిని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడినుంచి 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని  రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ నగరం కి చెందిన బాలాజీ విక్కీ( విక్కీ రాజ్ ) పగలు ఇంటికి తాళాలు వేసినా ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటాడు, ఇదే క్రమం లో గత నెల 15 వ తేదీన కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీ లోని స్నేహ సదన్ అపార్ట్మెంట్ లో నాలుగవ   ఫ్లోర్ లో నివాసం ఉంటున్న శంకర్ రావు దంపతులు బయటి వెళ్లిన సమయం లో ఇంటి తాళాలు పగల గొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన కూకట్ పల్లి పోలీసులు సి.సి కెమెరా ల  ఆధారంగా ఈరోజు బాలాజీ ని నాగరం లోని అతని ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది అని కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావు తెలిపారు. ఇలా దొంగతనాలకు పాల్పడి వచ్చినా డబ్బు తో టివి లో ప్రసారం అయ్యే టివి సీరియల్ లో పోలిసుల నటిస్తూ పగటి పూట దొంగతనాలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్నడు, నిందితుని వద్ద నుండి సుమారు 10లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు  ఏసీపీ సురేందర్ రావు తెలిపారు.

 

ఉన్నావో హత్యా కేసులో ఏడుగురు పోలీసులు  సస్పెండ్

 

Tags:Actor policing theft

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *