అరవింద్ కేజ్రీవాల్ తో నటుడు ప్రకాశ్ రాజ్ భేటీ

Actor Prakash Raj meet with Arvind Kejriwal

Actor Prakash Raj meet with Arvind Kejriwal

Date:10/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్రకటన వెలువడ్డ అనంతరం, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, తమ మద్దతు ప్రకటిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ప్రకాష్ రాజ్ ఈరోజు కలిశారు. తన రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్ కు ధన్యవాదాలు తెలియజేశానని పేర్కొన్నారు. పలు అంశాలకు సంబంధించిన సమస్యలపై తన బృందం రూపొందించిన వాటిపై చర్చించామని, వాటి పరిష్కారానికి వివిధ మార్గాలను పంచుకోవాలని కోరినట్టు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
Tags:Actor Prakash Raj meet with Arvind Kejriwal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *