Natyam ad

యూనివర్సిటీ లో ముగిసిన యాడ్ సెట్ ప్రవేశాలు

కడప ముచ్చట్లు:

నగరంలోని డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సోమ, మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియకు విద్యార్థుల నుంచి స్పందన లభించింది.ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ (సెట్ కమిటీ ఛైర్మన్) ప్రొఫెసర్  మునగాల సూర్య కళావతి, (ఏడీసెట్-22) కన్వీనర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగింది. ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏడీసెట్)- 2022 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించారు. క్యాంపస్ లొ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కౌన్సెలింగ్ నిర్వహించారు. సోమ, మంగళ వారం రెండు రోజులు కౌన్సలింగ్ కు 150 మంది పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బీఎఫ్ఎ లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, శిల్పం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు.ప్రవేశాల ప్రక్రియను ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మునగాల సూర్య కళావతి, రిజిస్ట్రార్(ఏడీ సెట్-22 )కన్వీ నర్ ఆచార్య ఈ.సీ.సురేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షించారు.

 

 

 

విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొందరు అభ్యర్థులు కొన్ని రకాల ధృవీకరణ పత్రాలు తీసుకురాకపోవడంతో వారికి కొంత సమయం ఇచ్చి వెసులుబాటు కల్పించారు. అనంతరం ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రవేశ పత్రాలను అధికారులు అందజేశారు.రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు ప్రవేశాలు పొందారని తెలియచేసారు.విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, యూనివర్శిటీలో విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతస్థాయిలో ఉండాలని యూనివర్శిటీ అధికారులు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమం లో డిప్యూటీ రిజిస్టర్ రాజేష్ కుమార్ రెడ్డి, సూపర్దెంట్ పవన్ కుమార్ రెడ్డి వైవీయూ సహ ఆచార్యులు ప్రొఫెసర్ వై. సుబ్బరాయుడు, ప్రొఫెసర్ ఎ. చంద్ర శేఖర్, ప్రొఫెసర్  న్. ఈశ్వర్ రెడ్డి ,పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Ad set admissions concluded in the University

Post Midle

Leave A Reply

Your email address will not be published.