రైతులకు అందుబాటులో ఉండాలి-ఏడీఏ

గోస్పాడు ముచ్చట్లు:

రైతులందరికీ వ్యవసాయ విస్తరణ సహాయకులు (వి ఏఏ) లు అందుబాటులో ఉండాలని నంద్యాల డివిజన్ వ్యవసాయ ఏ డి రామ్మోహన్ రెడ్డి ఆదేశించారు. గోస్పాడు లోని వ్యవసాయ కార్యాలయంలో విఏఏ లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం చేపట్టారు. ఎడిఎ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో విఏఏలు రైతులకు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు అందించాలన్నారు. పంట నమోదు ను ప్రతి రైతుకు తప్పనిసరిగా చేయాలన్నారు. అవసరమైతే సమయంలో రైతులకు ఎరువులను అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ హక్ టెక్నికల్ ఏవో నాగేంద్రప్రసాద్ ,విఏఏలు.ఏఈవోలు పాల్గొన్నారు.

 

Tags: ADA should be available to farmers

Leave A Reply

Your email address will not be published.