హరిత హారంలో  నీరు పోసిన అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే

-సోడియం హైపోక్లోరైట్ స్ప్రే

కామారెడ్డి ముచ్చట్లు :

కామారెడ్డి పట్టణంలో కోవిడ్-19 ఉధృతి దృశ్య ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా నివారణ చర్యల నిమిత్తం కామారెడ్డి పట్టణంలోని జనసాంద్రత గల ప్రాంతాలలో పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, బ్యాంకులు, కిరాణా దుకాణం సముదాయములు ముందు రెండు ట్యాంకర్లతో సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయడం జరిగింది. వివిధ వార్డులలో మురికి కాలువలు తీయడం, మురికి కాలువల పైన బ్లీచింగ్ పౌడర్ చల్లడం, రోడ్లు శుభ్రంగా ఉడవడం జరిగింది.హరిత శుక్రవారంలో భాగంగా స్థానిక శిశుమందిర్ స్కూల్ వద్ద మొక్కలకు నీరు పోయడం, సాసరింగ్ (పాదులు) చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, మున్సిపల్ కమిషనర్ ఎం. దేవేందర్, వాసుదేవ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. దేవదాసు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఎండి పర్వేజ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ కె. శ్యామ్, ఎఫ్ బి ఓ అబ్దుల్ మోమిన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, సంబంధిత ఏరియా పారిశుద్ధ్య జవానులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Additional Collector Venkatesh Dotre watered the green garland

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *