విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు..!
మంచిర్యాల జిల్లా: జిల్లాలో పల్లె ప్రగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాలోని వివిధ మండలాలలో పల్లె ప్రగతి, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాల పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల నిర్వహణలో అలసత్వం వహించిన జిల్లాలోని చెన్నూర్, దండేపల్లి, జైపూర్, జన్నారం, కోటపల్లి, లక్సెట్టిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు..