తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో ఆలయ నాలుగు మాడ వీధులు, లడ్డూ కౌంటర్లను ఆదివారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.ఇందులో భాగంగా అక్టోబర్ 4 నుండి జరుగునున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ రోజున లక్షలాదిగా విచ్చేసే భక్తుల ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు.అనంతరం లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌ను పరిశీలించి, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అధిక సమయం వేచి ఉండకుండా, త్వరితగతిన లడ్డూలను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.అదనపు ఈవో వెంట విజిఓ సురేంద్ర, ఆలయ ఎవిఎస్ఓ మనోహర్ తదితరులు ఉన్నారు.
Tags:Additional EV checks in Tirumala