తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు

తిరుమల ముచ్చట్లు:
 
టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గోవిందనిలయం, అన్నప్రసాదం కాంప్లెక్స్ తదితర ప్రాంతాలను అదనపు ఈఓ తనిఖీ చేశారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.అదనపు ఈఓ వెంట టిటిడి చీఫ్ ఇంజనీర్  నాగేశ్వర రావు, ఇఇలు  జగన్మోహన్ రెడ్డి,  సురేంద్రనాథ్ రెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ ఆఫీసర్  మల్లికార్జున, డిఇ  రవిశంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Additional evo checks in tirumala

Natyam ad