గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు…. కృష్ణాష్టమి వేడుకలు….నల్లనయ్యకు జన్మాష్టమి సంబరాలు,తర తరాల దేవుడిగా వెలుగొందుతున్న ఈ సమ్మోహన వేణుగోపాలుడు.కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఈ కన్నయ్య.నల్లని సాలగ్రామ శిలా రూపంలో “ఓం కార భంగిమ” ఈయన రూపం.1500 వందల ఏళ్ల చరిత్ర కలిగి, భక్తుల కోర్కెలు తీర్చే తరగని పెన్నిధి.అటు బాదామి చాణిక్యుల నుంచి ఇటు రెడ్డిరాజుల కోటకు పెన్నిధిగా నిలిచిన ప్రత్యక్ష దైవం.రెడ్డిరాజుల ఆస్థాన నర్తకీమణి “లకుమాదేవి”కి ఆరాధ్యదైవం. ఆమె ప్రతీ పౌర్ణమి రోజున స్వామివారి ఆస్థాన మండపంలో నాట్య నివేదన చేసేదని ప్రతీతి.గుంటూరు రూరల్ మండలం జూనంచుండూరు గ్రామంలో వేంచేసిన ప్రాచీన సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు .దేవాదాయ ధర్మదాయ శాఖ, గ్రామస్తులు, భక్తుల సహకారంతో వైభవోపేతంగా జరుపుతున్నట్లు ఆలయ ప్రధానార్చకులు రామశేషాచార్యులు తెలిపారు.అత్యంత పురాతనమైన ఈ దేవాలయంలో సమ్మోహనమైన రూపంలో స్వామి భక్తులకు కన్నుల విందుగా దర్శనమిస్తారు.వైఖానస సంప్రదాయంలో స్వామివారికి ఇక్కడ నిత్యార్చనలు, కల్యాణ, పూజాదికాలు జరుగుతుండటం గమనార్హం.ఈ ఆలయంలో స్వామివారి ముగ్ధ మనోహర రూపం “ఆది ప్రణవ రూపం”స్వామివారి చేతిలో పిల్లన గ్రోవి అభయ హస్తంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.విగ్రహ పైభాగంలో ఒకప్రక్క దశావతారాలు,మరోపక్క సప్తఋషులు,పాదాల చెంత ఇరువైపులా రుక్మిణి, సత్యభామలు గోవులతో కలసి ఉండటం మరో ప్రత్యేకత.వీటన్నింటినీ కలిపి ఒకే విగ్రహంలో ప్రణవ రూపంగా ఏకశిలలోని నల్లనయ్య భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు.స్వామివారి ఘనచరిత్ర నేటికి మద్రాస్ అడయార్ లైబ్రరీలో నిక్షిప్తమై ఉండటం, దానిపై పలువురు ఔత్సాహికులు “జూనంచుండూరు నల్లనయ్య” చరిత్ర పుస్తక రూపంలోకి తీసుకురావటం విశేషం.
Tags;Adi Pranavasvarupa is this Nallanaya