Natyam ad

ఆదిశంకర కళాశాల మినిస్టర్ ప్రోగ్రాం

నెల్లూరు ముచ్చట్లు:


ఇంజనీరింగ్ పట్టాలు పొందినవారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాని గోవర్ధన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు .  గూడూరు పట్టణ పరిధిలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో  నిర్వహించిన 6 వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న 6 వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వేద పండితుల ఆశీర్వాదంతో కళాశాల యాజమాన్యం పూర్ణకుంభ స్వాగతం పలికారు .  అనంతరం డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా పట్టాలు అందజేశారు . అదేవిధంగా ప్రతిభ చాటిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు . ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకొని కన్న తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు .

 

 

గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతానని  తన వృత్తాంతాన్ని విద్యార్థులకు వివరించారు . విద్యను అభ్యసించేందుకు పేదరికం అడ్డురాదని తానుకూడా పేదరికంలో పుట్టి కష్టపడి చదువుకుని దేశ అత్యున్నత చదువు అయినటువంటి ఐఏఎస్ పూర్తిచేసి ప్రజలకు చేరువై సేవచేసే అవకాశం కలిగిందని తెలిపారు . ఈ కార్యక్రమంలో మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన అతిథులు వెంకట్ , వినయ్ కుమార్ , జాషువా డేవిడ్ , విద్యాసంస్థల చైర్మన్ అనూష , దిలీప్ , కళాశాల డైరెక్టర్ మోహన్ , ప్రిన్సిపాల్ లోకనాథ్ , వివిధ శాఖల హెచ్ ఓ డి లు , ఏవో రామయ్య ,  కళాశాల అధ్యాపకులు , సిబ్బంది , విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

 

Post Midle

Tags: Adi Shankara College Minister Programme

Post Midle